TEACHERS INFO

More

STUDENTS INFO

More

APREIS 2019 5th Class Entrance Test Results Announced

5 వ తరగతికి ప్రవేశము కొరకు సమాచారము ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ , 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ( ఇంగ్లీషు మీడియం - ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సిలబస్ ) లో ప్రవేశానికి దరఖాస్తులు కోరింది . ప్రవేశ పరీక్ష తేదీ 9 - 01 - 2018 శనివారం నాడు ఉదయం 11 . 00 గరి , ల నుండి మధ్యాహ్నం 11 . 00 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో నిర్వహించారు .


Direct Link: APREIS RESULTS

Babu Jagjivan Ram Jayanthi on April 05

డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. రాష్ట్రవేడుకగా జరపాలని ఉత్తర్వులిచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం.ఆయనగురించి క్లుప్తంగా.....

భారత ప్రజలకు లభించిన అమూల్యరత్నం  అని కితాబు పొందిన ప్రజాసేవకుడు, బాబూ జగ్జీవన్ రామ్.ఆయనను స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమా ప్రాంగణాన జరిగిన,  ఉప్పొంగిన సమరోజ్వ సమున్నత ఘట్టాలను గుర్తు చేసుకోవడమే.

జగ్జీవన్‌రామ్‌ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేవ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయి.

భారత రిపబ్లిక్‌ తొలి లోక్‌సభ (1952)లో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్‌ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచారు. ముప్ఫైమూడు సంవత్సరాు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించారు. మొదటి శ్రేణి పార్లమెంటే రియన్‌గా నిలిచారు.
హేతుబుద్ది,
సానుకూల దృక్పథం,
స్పష్టమైన దార్శనికత,
విస్తృతమైన అధ్యయనం,
గొప్ప మేధాశక్తి,
స్థిరమైన సంక్పలం నిత్యకృషీవత్వం,
ఓరిమి,
కారుణ్యం,
చర్చించే గుణం,
ఒప్పించే గుణం,
ఆత్మవిశ్వాసం,
ధైర్యం,
సేవానిరతి,
కార్యనిర్వహణాదక్షత
మొదగు లక్షణాలు నిండుదనంతో బలమైన సుగుణశీ వ్యక్తిత్వం ఆయనకే సొంతం.

పండిట్ నెహ్రూ నుంచి కార్యదక్షుడిగా మన్ననలను పొంది, అగ్రశ్రేణి నాయకుల్లో ఒకడుగా, భారత స్వాతంత్య్ర ఉద్యమం లోను, నవభారత నిర్మాణంలో ఉదాత్తమైన పాత్ర నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్, 1908, ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా, చాంద్వా గ్రామంలో బసంతీదేవి, శోభిరామ్ దంపతు లకు జన్మించారు. అప్పటి ఆచారాల ప్రకారం 8వ ఏటనే బాల్యవివాహం జరిగింది. ప్రాథమిక పాఠశాల విద్య ముగిసిన తర్వాత 1928లో ఆయన కాశీని వదలి కలకత్తాకు వెళ్లి అక్కడ 1931లో బిఎస్సీ డిగ్రీని పొందారు.

చదువుకునే రోజుల్లో మదన్ మోహన మాలవ్యా, పండిత గోవింద వల్లభ పంత్‌లతో పరిచయం ఏర్పడింది. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి దళితుల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1933లో భార్యా వియోగం జరగడంతో, 1935 జూన్‌ ఒకటిన కాన్పూర్‌కి చెందిన సంఘసేవకుడు డాక్టర్‌ బీర్బల్‌ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్‌రామ్‌ వివాహం జరిగింది. ఇంద్రాణిదేవి స్వాతంత్య్ర సమరయోధురాు మాత్రమేగాక, విద్యావేత్తకూడా. స్వాతంత్య్రోద్యమ కామంతా తోడుగా పోరాడిన వీరిద్దరికీ ఇరువురు సంతానం. కుమారుడు సురేష్‌. కుమార్తె మీరా. తండ్రి జగ్జీవన్‌రామ్‌ ఆదర్శాతో కుమార్తె మీరాకుమార్‌ కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి సేవందించారు.

బిహార్ రాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యదర్శిగా పనిచేసారు. బిహార్‌లో భూకంపం సంభవించినప్పుడు మహాత్మాగాంధీతో పాటు జగ్జీవన్ రామ్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు..

డాక్టర్ రాజేంద్రప్రసాద్, టక్కర్ బాబాల ఆశీర్వాదంతో రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి నాటి శాసనసభకు ఎన్నికయ్యారు.

1935 ఇండియా చట్టం కింద రాష్ట్రాల్లో మంత్రివర్గాలు ఏర్పడినప్పుడు బిహార్ రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన మొదటిసారి పార్లమెంటరీ కార్యదర్శి అయ్యారు. 1937లో బిహార్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని హజారిబాగ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు జయప్రకాశ్ నారాయణ్‌తో పరిచయం ఏర్పడింది.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్,
జగ్జీవన్ రామ్,
జయప్రకాశ్ నారాయణ్‌లు బిహార్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు.

1946లో నెహ్రూ నాయకత్వంలో అవిభక్త భారత్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో కార్మికశాఖను నిర్వహించారు. 1947లో అంతర్జాతీయ కార్మిక సమావేశంలో పాల్గొని తిరిగివస్తుండగా, బస్రా సమీపంలో ఆయన ప్రయాణం చేస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆయన నెల రోజులపాటు బ్రిటీష్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందారు.

1948లో హైదరాబాద్‌లో జరిగిన దళిత వర్గాల మహాసభకు ముదిగొండ లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, జగ్జీవన్ రామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1952లో నెహ్రూ మంత్రివర్గంలో తపాలాశాఖను, 1956లో రైల్వేశాఖను నిర్వహించారు. తదనంతరం వ్యవసాయశాఖ మంత్రిగా దేశంలో హరి త విప్లవానికి కారణభూతుడై ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి ‘‘భారత ఆహార సంస్థ’’  (ఎఫ్‌సిఐ), సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్‌లను ఏర్పా టు చేశారు.

నెహ్రూ అనంతరం లాల్‌బహదూర్ శాస్ర్తీ, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మళ్లీ కార్మిక, ఉపాధి కల్పనాశాఖలు లభించాయి. 1967లో వ్యవసాయశాఖకు మారి  వ్యవసాయశాఖను సమర్ధవంతంగా నిర్వహించారన్న పేరు సంపాదించుకున్నారు.

కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు ఇందిరాగాంధీ పక్షాన ఉంటూ 1969లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. తర్వాతికాలంలో ఆయన రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

1976లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు.

1977 లో మొరార్జీదేశాయ్‌ ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో జగ్జీవన్‌రామ్‌ కేంద్ర రక్షణ శాఖామంత్రిగా విధు నిర్వహించారు. అంతేగాక, 1979 జనవరి 24న డిప్యూటీ ప్రధానమంత్రిగా జగ్జీవన్‌రామ్‌ బాధ్యత స్వీకరించారు.

బాబూ జగ్జీవన్ రామ్ ప్రజాభిమానం కలిగిన నాయకులు.
సమాజం దళిత జాతుల పట్ల అవలంభించే అంటరానితనం, వారికీ జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం జరపటానికి దళిత ప్రజలను సంఘటిత పరుస్థూ ఒక కార్యకర్తగా అయన ప్రజా జీవనంలోకి అడుగుపెట్టారు.
1930 లో గాంధీజీ సత్యాగ్రహోద్యం ఆరంభించినపుడు జగజీవన రామ్ పాల్గొన్నారు. ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు సత్యాగ్రహం, మరోవైపు దళిత సమాజ సంస్కరణ కార్యక్రమం చేపట్టారు.

1977, మార్చి 6న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగాన్ని వినడానికి గత 38 ఏళ్లలో ఎన్నడూ రానంతమంది జనం వచ్చారు.

బాబూజీ గొప్ప వక్త. పార్లమెంట్లో వారు అనర్గల మైన వాగ్ధాటి తో ప్రత్యర్ధులను అవాక్కులుగా చేసేవారు.

బాబూ జగ్జీవన్ రామ్‌కు ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.

అలుపెరుగని తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానికి ఇక సెలవంటూ, 1986, జులై 6న ఈ లోకాన్ని వీడారు.

జీవిత మంతా దేశ సేవకు అంకితం చేసి నవ భారత నిర్మాణంలో నాల్గు దశాబ్దాలు అవిరళ కృషి చేసిన బాబూ జగజ్జీవనరాం పాత్ర చిరస్మరనీయమైనది. అందుకే బాబూజీ కి యావద్భారతం నీరాజనం అర్పిస్తుంది. బాబూజీ అని ఆత్మీయంగా పిలుచు కుంటున్నది.
జోహార్ బాబు జగ్జీవన్ రామ్.. జోహార్...జోహార్.

AP Elections 2019 Poling Day and Counting Days Holidays GO NO 799

Elections - General  Elections to  House of People  (Lok Sabha)  and  Andhra Pradesh  State Legislative Assembly, 2019  – Declaration of Holiday on     Polling  Day  on  11.04.2019 (Thursday),  Counting  Day  on  23.05.2019 (Thursday)  - Orders- Issued.

G.O.RT.No. 799                                                  Dated: 04-04-2019 

Read: 1.  From  the ECI,  New Delhi,  Press  Note.No.ECI/PN/23/2019,       Dt.10.03.2019
2. ORDER:    From  the E.C.I.,  Lr.No.78/2019/EPS,Dt.22-03-2019.

According to  the  election  schedule  announced  by  the  Election Commission of India,  vide  reference first  read  above,  the  General  Elections to  House  of  People  (Lok  Sabha) and Andhra  Pradesh  State  Legislative Assembly, 2019  will be held on  11.04.2019 (Thursday) in one phase for  25 Parliamentary  Constituencies  and  175 Assembly  Constituencies  of  13 districts of  the  Andhra  Pradesh State.

2. Hence,  the State Government  hereby  authorize  all  the Collectors  & District  Election  Officers  in  the State to  declare local  holiday  on  the day before the day  of  poll  i.e.,  on  10.04.2019 (Wednesday)   and  day  of  poll  i.e., 11.04.2019(Thursday)  as  the case  may  be,  in  the areas  of  the aforesaid Parliamentary Constituencies/   Assembly  Constituencies  in  connection with the  conduct of  poll  as large  number  of  Public Buildings,  including  Educational Institutions and other  buildings will  be  utilized  for  the  purpose  of  setting up of  the  polling stations and distribution  centers in connection with conduct of General Elections to  the  House of  Parliament and Andhra  Pradesh State Legislative Assembly,2019.  Similarly  all  the Collectors  & District  Election Officers are authorized to declare  a  local holiday on  the  day fixed for counting  i.e., on  23.05.2019 (Thursday),  if  necessary.  On  local  holidays,  the Treasuries  and  Sub-Treasuries  in  the District  will,  however,  function. 

3. Government also  direct, that,   (i) the  Labour, Employment  Training  &  Factories Department to  declare  a paid  holiday  on  the day  of  poll  i.e.,  11.04.2019 (Thursday)  as  the case may be, if  there  is no  holiday  under  the  A.P  Factories and Establishments  Act,  1974 (Act  No.32/1974)  and  A.P  Shops  and Establishments  Act,  1988  read  with  the provisions  Laid  down  in Section  135-B of  the Representation  of the People  Act,  1951 so  as  to enable  the workers  to  exercise  their franchise.  Regarding  the industrial Undertakings / Establishments which are  working on  shift  during which the  poll is  to  be  taken, it  is clarified that a holiday may be  declared only  for  the  shift  during  which  the  poll  is  to  be  taken,  in  view  of  the clarification  issued  by the  Election  Commission of  India,  in its letter No.78/99/PLN-1,Dt:06.04.1999. (ii)  the  Commissioner  of  Labour, A.P., to  declare  a closed  holiday on  the day  of  poll  i.e.  11.04.2019 (Thursday),  as  the case  may  be,  if  there is no  holiday under  the  A.P.,  Shops and  Establishments Act,  1988  (Act 20/1988)  read  with  provisions  laid  down  in  Section  135-B (4)  of  R.P. Act,  1951,  so  as  to  enable  the electors  working  in  such  shops, establishments  to  exercise  their franchise; (

i)   the  Municipal  Corporations, Municipal Councils and other  Local Bodies and  every  University  established  by  central  or State Act  may  also observe  local holidays to be  declared  by the  Collectors & District Election  Officers, as authorized  by the  Government, on  the  day of  poll i.e.,  11.04.2019 (Thursday), as  the case may  be; 4.      The  Government  also  direct  that,  as  clarified  by  the  Commission  vide their letter second  read  above,  in  the  case  of  employees  who are  ordinarily resident in the  area  of  Parliamentary Constituencies/Assembly Constituencies  where poll  on  11.04.2019 (Thursday),  as  the case  may  be, but  having  the place of  work  outside the Constituency  area,  and  the date  of poll  being  different  in  respect  of  the  place of  residence,  those electors including casual workers working outside  the  Constituency  concerned would be  entitled  to  the  benefit of  a paid  holiday extended  under  the  section 135B(1)  of  the Representation  of  the  people  Act,  1951,  although  his/her office  does  not happen to  be  closed  on  that particular  day .The  daily wage/casual  workers  are also  entitled  for  a holiday and wages on  poll day as provided  in  Section135B of  the Representation  of  People  Act,  1951.

AP GANITHA MITRA ENDLINE TEST on April 4th

Rc.No.144/B/SCERT/2019 Dated:29-03-2019.
Sub: Implementation of quality initiatives Ganitha Mitra Endline test-on 4th April-communication of Endline test Administration reg.

As you all aware that we are implementing GANITHA MITRA Programme in 2000 model primary Schools of all 13 districts in the state. Accordingly completed teacher trainings and conducted baseline test on 28th December.

Now it is proposed to conduct Endline test on'GANITHA MITRA' on 4th April to assess the improvement of the programme in the field. Endline papers of 2nd 3rd 4th &5th classes are attached to this. Hence concerned AMOs are requested to communicate the endline question papers to all identified model primary schools well in advance with request to meet the expenditure from the school grants.

After conducting endline test it is requested to collect endline test data within a week and send to SCERT by 15th April. Please use the excel sheet supplied for baseleine test for consolidation of the data. Same excel sheet is annexed to this again.

Collection of baseline data got delayed due to several reasons, please send the consolidated data of endline test by 15th April without fail as we need to prepare final report on GANITHA MITRA programme implementation.

Types of Charges in SBI

SBI 5 CHARGES

మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?

మీకు SBI బ్యాంకులో అకౌంట్ ఉందా?
మీకు తెలియకుండానే బ్యాంకు మీపై చార్జీలు విధిస్తుందని ఎప్పుడైనా గమనించారా? బ్యాంకు అందించే సర్వీసుల్లో మీపై సర్వీసు ఛార్జ్ విధిస్తుందని తెలుసా? ఎస్ బీఐ బ్యాంకు.. తమ కస్టమర్లపై విధించే సర్వీసు ఛార్జీలు ఏంటో ప్రతి కస్టమర్ కు అవగాహన ఉండాల్సిందే. లేదంటే.. అనవసరంగా ఆందోళనకు గురికావాల్సి వస్తుంది. ముందుగానే కస్టమర్లకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు విధిస్తుంది అనేదానిపై కాస్త అవగాహన పెంచుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ఎస్ బీఐ కస్టమర్లకు విధించే 5 ఛార్జీలు ఏంటో ఓసారి లుక్కేద్దాం.

1. కనీస నగదు నిల్వ లేకుంటే :

ఎస్ బీఐ అకౌంట్ దారులు ఎవరైనా తమ బ్యాంకు అకౌంట్ లో కనీస నగదును నిల్వ చేయాలి. మినిమం అకౌంట్ బ్యాలెన్స్ (MAB) ఉండాల్సిందే. లేదంటే బ్యాంకు సదరు ఖాతాదారుడిపై ఛార్జ్ విధిస్తుంది. ఈ ఛార్జీలు బ్రాంచ్ ఏరియాలను బట్టి మారుతుంటుంది. అంటే.. మెట్రో నగరాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అనుగుణంగా ఎస్ బీఐ ఛార్జీలు వర్తిస్తాయి. మెట్రో సెంటర్ బ్రాంచ్ అకౌంట్ దారులు అయితే.. మినమం అకౌంట్ బ్యాలెన్స్ లేకుంటే వారికి నెలకు రూ.50 (జీఎస్టీతో కలిపి) ఛార్జ్ చేస్తుంది. 50శాతం కంటే ఎక్కువగా అకౌంట్ బ్యాలెన్స్ పడిపోతే సదరు రూ.75 వరకు ఛార్జ్ చేస్తుంది. 75శాతం, అంతకంటే ఎక్కువ శాతానికి నగదు నిల్వ పడిపోతే రూ.100 వరకు ఛార్జ్ చేస్తుంది.


i) అర్బన్ బ్రాంచ్ :

అర్బన్ సెంటర్ బ్రాంచ్ ల్లో ఎస్ బీఐ అకౌంట్ దారులకు నెలకు జీఎస్టీతో కలిపి నెలకు రూ.40, రూ.60, రూ.80 వరకు
ఛార్జీలు వర్తిస్తాయి. కనీస నగదు నిల్వ చేయకపోతే.. వారికి రూ.3వేల వరకు ఛార్జ్ చేస్తుంది.

ii) సబ్ అర్బన్ బ్రాంచ్ : కనీస నగదు నిల్వ చేయని అకౌంట్ దారులకు జీఎస్టీతో కలిపి రూ.2వేలు వరకు (నెలకు రూ.25, రూ.50, రూ.75 వరకు) ఛార్జ్ చేస్తుంది.

iii) రూరల్ బ్రాంచ్ : గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్ బీఐ బ్రాంచ్ ఖాతాదారులు కనీస నగదు నిల్వ చేయకుంటే రూ. వెయ్యి వరకు అంటే..( నెలకు  రూ.20, రూ.30, రూ.50 వరకు) ఛార్జ్ చేస్తుంది.

2. ATM ఛార్జీలు :

చేతిలో ఎస్ బీఐ ఏటీఎం ఉంది కదా అని ప్రతిసారి ఏటీఎం సెంటర్ దగ్గరకు వెళ్లి అకౌంట్ లో డబ్బులను తెగ విత్ డ్రా చేస్తుంటారు. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తే ఛార్జీలు ఉంటాయని చాలామందికి తెలియదు. ఏటీఎం నుంచి నెలలో 5 ట్రాన్స్ జెక్షన్ లు మాత్రమే ఉచితం. 5కు మించి దాటితే ఛార్జీలు వర్తిస్తాయి. ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్ కు.. జీఎస్టీతో కలిపి రూ.10, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్ కు రూ.5 వరకు ఛార్జ్ చేస్తుంది. గతనెలలో అకౌంట్ లో రూ.25వేల వరకు మినమం అకౌంట్ బ్యాలెన్స్ ఉంటేనే ఈ ఛార్జ్ వర్తిస్తుంది. ఒకవేళ కస్టమర్ అకౌంట్ లో రూ.25వేలకు పైగా నగదు నిల్వ ఉంటే మాత్రం.. ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు ఉండవు.

మెట్రో సెంటర్లు : ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఎస్ బీఐ ఏటీఎం కార్డుతో విత్ డ్రా చేస్తే.. రూ.20 (ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్), నాన్ ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్ కు రూ.8 వరకు ఛార్జ్ చేస్తుంది. (మెట్రో సిటీల్లో నెలకు 3 సార్లు ఉచితం.. నాన్ మెట్రో సిటీల్లో అయితే 5 సార్లు ఉచితం) ఎలాంటి ఛార్జీలు వర్తించవు. అది కూడా కస్టమర్ గత నెలలో తన అకౌంట్ లో మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.1 లక్ష వరకు ఉంటేనే. ఇలాంటి కస్టమర్లకు ఇతర ఏటీఎంల్లో విత్ డ్రా చేసిన ఎలాంటి ఛార్జీలు వర్తించవు.


3. Check Book జారీ చేసినప్పుడు

ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్ బీఐ అకౌంట్ దారుడు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ (QAB)తో రూ.1 లక్ష వరకు కనీస నగదు నిల్వ ఉంచితే.. తొలిసారి 25 చెక్ లీవ్స్ ను ఉచితంగా బ్యాంకు అందిస్తుంది. ఆ తర్వాత నుంచి 10చెక్ లీవ్ లకు రూ.30, 25 చెక్ లీవ్ లకు రూ.75, 50 చెక్ లీవ్ లకు రూ.150 (జీఎస్టీతో కలిపి) ఛార్జ్ చేస్తుంది. QAB రూ.1లక్ష.. అంతకంటే ఎక్కువ నగదు అకౌంట్ లో ఉన్న సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ జారీ విషయంలో ఎలాంటి ఛార్జీలు ఉండవు.

4. చెక్ రిటర్న్డ్ ఛార్జీలు :

చెక్ రిటర్న్డ్ ఛార్జీలు జీఎస్టీతో కలిపి ఎస్ బీఐ రూ.500 వరకు ఛార్జ్ చేస్తుంది. అకౌంట్ లో తగినంత డబ్బులు లేకుండా చెక్ డ్రా చేసిన పక్షంలో అది బౌన్స్ అయితే మాత్రం.. ఎస్ బీఐ బ్యాంకు చెక్ రిటర్న్డ్ ఛార్జీలను విధిస్తుంది. ఒకవేళ సాంకేతిక కారణాలతో చెక్ రిటర్న్ అయితే మాత్రం జీఎస్టీతో కలిపి రూ.150 ఛార్జ్ చేస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. టెక్నికల్ రీజన్ కు మాత్రం చెక్ రిటర్న్ ఛార్జీలు ఉండవు. (ఎందుకంటే.. ఇందులో కస్టమర్ తప్పిదం లేదని).

5. DD ఛార్జీలు:

డిమాండ్ డ్రాఫ్ట్ లు, బ్యాంకర్ల చెక్ లు జారీ చేసినప్పుడు (ఆఫీసు ఇంటర్నల్ డీడీలు)లపై జీఎస్టీలతో కలిపి రూ.25 వరకు ఛార్జ్ చేస్తుంది. ఎస్ బీఐ బ్యాంకు నుంచి తీసే DD రూ.5వేలు వరకు ఉంటే రూ.25, రూ.5వేలు నుంచి రూ.10వేలు ఉంటే.. రూ.50 జీఎస్టీతో ఛార్జ్ చేస్తుంది. రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు డీడీలపై ఒక్కో వెయ్యికి రూ.5 చొప్పున జీఎస్టీతో కలిపి ఛార్జ్ అవుతుంది. రూ.లక్షకు పైగా డీడీ తీస్తే.. జీఎస్టీతో కలిపి ఒక వెయ్యికి (కనిష్టంగా రూ.600, గరిష్టంగా రూ.2వేలు) రూ.4 చొప్పున ఛార్జ్ చేస్తుంది.

AP Gurukula Inter Admissions

ఏపీ గురుకుల ఉర్దూ బాలుర కళాశాలలోఇంటర్ ప్రవేశాలు.

పాత గుంటూరు లోని ఏపీ గురుకుల ఉర్దు బాలుర జూనియర్ కళాశాలలో 2019 -20 విద్య సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ , బైపీసీ , సీఈసీ గ్రూపులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ఏ అజీజ్ తెలిపారు.

కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఏపీఆర్ జేసీ సెట్ తో సంబంధం లేకుండా ఉర్దూ, ఇంగ్లీష్ మీడియా లో నేరుగా ప్రవేశం పొందవచ్చని తెలిపారు. కళాశాలలో హాస్టల్ వసతి ఉందన్నారు. ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు 6 జేపి ఏకు పైగా సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు వివరాలకు కు 9701451826, 9949743080 నంబర్లలో సంప్రదించాలనీ కోరారు.

AP Check Your SR Entry Details

మీ SR లో ఇవి enter అయ్యాయో లేదో తెలుసుకోండి.

Service Register.-Entreis:-

మీ ఎస్. ఆర్. లో అన్ని ఎంట్రీస్ పడ్డాయా?

ప్రతి సంవత్సరం ఎస్ .ఆర్ .ను చెక్ చేస్తున్నారా?

అయితే ఈ క్రింది entries చెక్లిస్ట్ రాసుకోండి మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్ .ను అడిగి చెక్ చేసుకోని ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ హెచ్.ఎం .లేదా ఎం .ఈ .ఓ. గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి.

1. Periodical Increments entry:-

ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ ఎస్. ఆర్. లో వేశారా? లేదా ?సరి చూసుకోండి.

2.G.I.S.ఎంట్రీ:-

జి .ఐ .ఎస్ .చందా డిడక్టు అవుతూ ఉంటుంది కదా .మీ ఎస్ .ఆర్ .లో జి .ఐ .ఎస్ .అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంత కాలం ,ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా ?లేదా ?చెక్ చేసుకోవాలి .అయితే జి .ఐ .ఎస్ .అమౌంట్ enhance అవుతూ ఉంటుంది .గమనించుకోవాలి.

3.. APGLI ఎంట్రీ:-

మీ జీితంలో ప్రతి నెల ఏ.పీ .జి .ఎల్ .ఐ .అమౌంట్ డిడక్ట్  అవుతుంది కదా .మీ ఎపిజిఎల్ఐ subscription  enhance అయినప్పుడల్లా ఎంట్రీ పడిందా ?లేదా? చెక్ చేసుకున్నారా.

4.E. L. Entry:-

ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్ .ఆర్. చివర రాసే ఈ .ఎల్.  ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.

5.Half Pay Leave Entry:-

ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half pay leave లను S. R.చివరి పేజీలో  half pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.

6.Training Entry:-

ఇంతవరకు సమ్మర్ లో అయిన ట్రైనింగ్  , ఇతర డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి .ఇది చాలా ముఖ్యమైన విషయం.

7. E. H. S. Entry:-

Employee Health Scheme ఎంట్రీ మీ ఎస్. ఆర్ .లో రాయబడిందా ?లేదా ?చూసుకోవాలి.

8. A.A.S. Entry:-

మన సర్వీసు 6,12,18,24సంవత్సరాలు పూర్తి అయినప్పుడు A.A.S. ఇంక్రిమెంట్ మన ఎస్. ఆర్. లో ఎంట్రీ అయిందా ?లేదా ?చూసుకోవాలి.

9.Antecedent entry:-

ఆంటీస్డెంట్ వెరిఫికేషన్ అయిన తరువాత మన ఎస్ .ఆర్ .లో ఐడి నెంబర్ తో సహా ఎంట్రీ అయ్యిందో లేదో చూసుకోవాలి.

10. Service Regulations entry:-

ఆంటీసిడెంట్ వెరిఫికేషన్ తరువాత రెగ్యులరైజేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి.

11.Promotion entry:-

మనకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్. ఆర్ .లో వేయించుకోవాలి.

12.Transfers entry:-

మనకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి.

13.Departmental test entry:-

మనం GOT,EOT, Language tests,.HM account tests ఇలా ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.

14.Higher Qualifications entry:-

మన డిగ్రీ ,పీజీ ,బీఈడీ ,ఎంఈడీ ,ఎంపీఈడీ ఇలా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.

How do we Vote without Voter Id Card

How do we Vote without Voter Id Card. ఓటర్ ఐడి కార్డు లేకుండా ఎలా ఓటు వేయాలి.

11 కార్డుల్లో ఏదో ఒకటి చూపి ఓటేయొచ్చు.

భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఓటు వేసేందుకు హక్కు ఉన్నప్పటికీ రుజువుగా రాష్ట్ర వ్యయంతో ఎన్నికల సంఘం సమకూర్చే ఓటరు ఫొటో గుర్తింపు కార్డు వినియోగంపై ఆ హక్కు ఆధారపడి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఆర్ ముఖ్య కార్యదర్శి కె . ఎఫ్ విల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలిపారు .

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు చూపాలి . ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులను చూపి ఓటేయవచ్చని ఆయన పేర్కొన్నారు .

కార్డు లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా . .
1 . పాస్ పోర్టు ,
2 . డ్రైవింగ్ లైసెన్సు ,
3 . రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు , పీయస్యూలు , పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డులు ,
4 . బ్యాంకులు , తపాలా కార్యాలయాలు , జారీ చేసిన ఫొటో గల పాస్ పుస్తకాలు ,
5 . పాన్ కార్డు ,
6 . ఎన్డీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు ,
7 . మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ,
8 . కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద . జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ,
9 . ఫొటోతో కూడిన పింఛను పత్రం ,
10 . ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ,
11 . ఆధార్ కార్డు చూపి ఓటేయవచ్చన్నారు .

ఓటు వేయడానికి ఓటరు వచ్చిన పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన ఓటర్ల జాబితాలో కచ్చితంగా ఆ ఓటరు పేరు ఉండాలని తెలిపారు . ఎన్నికల జాబితాలో నమోదై విదేశాలలో నివసిస్తున్న ఓటర్లు వారి ఒరిజినల్ పాస్ పోర్టు ఆధారంగా మాత్రమే పోలింగ్ కేంద్రంలో తమ గుర్తింపును రుజువు చేసుకోవాలని ( ఏదేనీ ఇతర గుర్తింపు పత్రాన్ని చూపరాదని ) ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

AP Half Day Schools Time Table After noon Session

GOVERNMERT OP ANDHRA PRADESH SCHOOL EDUCATION DEPARTMENT From K Sandhya Rani, I.Po.S. Commissänner of Schoolthe State To All the Collectors and Distriet Magistrates in Andhra Pradesh A.P.. Amaravati Lr.Re.No.91/A &1/2019, Dated: 15/03/2019 Sir/Madam

Sub: School Education School Acadenic Calendar for the year 201-9 Half day Schools during summer Change of School timings in the schools which were drafted as Examination centres-Request Reg.

Ref 1. School Academic Calendar 2018 19 2. This office Procs.Rc No.91A & 1/2019, dated: 14.03.2019 I wish to state that in the reference 2 cited necessary instructions were issued to all the Regional Joint Director of School Education and the District Educational Officers in the State to run the half-a day schools with eflect from 15.03.2019 upto last working day of the Academic year 2018-19 in all Govt. Management Schools ie., Gov, MPP, ZP.Mpl and Aided Schools in the State.

And also issued instructions to the Pyi Mansgement Schools to conduct schools for the said period as deeided by the Parent Teacher In this regard I wish to inform that, 2839 schools are drafted as Examination centres for conducting the SSC Public Examinations March 2019 from 18.03.2019 to 02.04.2019 in the morning session in the State. As such, the regular classes other than X Class have to be conducted from 1.00 P.M to 5.00 PM during the SSC Examinations in these 2839 Schools.

In some of these schools, classes for Primary sections are also being conducted in the aftemoon scssion I, therefore request you to assess the local heat conditions prevailed in your respective district and change the school timings in which the SSC Examination Centres are located in your district accordingly Scanned by CaSuanner File No.ESE02-30r42/2013-A&I-CSE Youra faithfully SAN DHYA RANE HANNEGANTI Cornmissinner ef Schnl Education Copy to the all the District Educntionnl Oficers in the State Copy to the all Regiosal Joint Directors of School Education in the State Copy submitted to Spl. Chlef Seeretary to the Government, School Education Dennrtment, Government of A.P, Amaravati for kind informntion

AP SA 2 Examinations Time Table

AP SA 2 Examinations Time Table
All RJDSEs, District Educational Officers in the state are hereby informed that the Common Summative Assessment-II is scheduled to be conducted from 08-04-2019 to 23-04-2019 in all Primary and High schools for classes I to IX under all managements.

It is to be noted that there will be two subjects/papers on 08-04-2019 and 09-04-2019,keeping in view the compelling schedule of General Elections, 2019.Further, all the DistrictEducational Officers are requested to communicate the same to all schools under all managements inthe respective districts and ensure the smooth and qualitative conduct of examinations as per theTime Table annexed.

Download

AP SSC Public Exams 2019, Instructions for Invigilators

SSC PUBLIC EXAMINATIONS, MARCH, 2019
పరీక్షా కేంద్రములోని  ఇన్విజిలేటర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు

పరీక్ష జరుగు రూమ్  లోనికి వెళ్ళేముందు

1. పరీక్ష జరిగే ప్రతిరోజు ఉదయం గం. 8.30 ని.ల కల్లా పరీక్షా కేంద్రమునకు చేరుకొనవలెను.

2. తమ మొబైల్ ఫోన్లను చీఫ్ సూపరింటెండెంట్ (C.S.) వద్ద డిపాజిట్ చేయవలెను. ఎట్టి పరిస్థితులలోను పరీక్ష జరుగు రూమ్ లోనికి తీసుకొని పోరాదు.

3. లాటరీ పద్దతిలో రూమ్ నంబరును తీసుకుని, ఆ పరీక్ష జరుగు గదికి సంబంధించిన OMR SHEETS, MAINANSWER SHEETS, STUDENTS PHOTO గుర్తింపు షీట్లను, స్టాప్లర్లు, పిన్నులు, స్టిక్కర్లు, దారాలు, వివిధ ఫారములు మరియు పరీక్ష నిర్వహణకు అవసరమైన సామాగ్రిని C.S. నుండి తీసుకొని, పరీక్ష తేది, Subject, ఆ సామాగ్రి వారి పరీక్ష రూమ్ కి  సంబంధించినదో కాదో నిర్ధారించుకొన్న తరువాతే వారికి సంబంధించిన పరీక్ష రూమ్ కి వెళ్ళవలెను.

4. పరీక్ష జరుగు రూమ్ లోనికి వెళ్ళేముందు C.S. చే ఇవ్వబడిన గుర్తింపు కార్డును ప్రతీరోజూ తప్పనిసరిగా ధరించవలెను.

_*బార్ కోడ్ OMR SHEETS విషయంలో తీసుకొనవలసిన జాగ్రత్తలు*_

5. ఇన్విజిలేటర్లు C.S., నుండి తీసుకొన్న మెటీరియల్లోని OMR SHEETS ఆ రోజు పరీక్షకు సంబంధించినవో కావో, వారి పరీక్ష రూమ్ కు సంబంధించినవో కావో జాగ్రత్తగా సరిచూచుకొనవలెను, ఒక వేళ పొరబాటున మీకు వేరే రూమ్ కి  సంబంధించిన OMR SHEETS ఇవ్వబడినచో వాటిని C.S.కి రిటర్న్ ఇచ్చి వారి రూమ్ కి సంబంధించిన OMR SHEETS ను తీసుకొనవలెను.

6. ఇన్విజిలేటరు OMR SHEETS పైన గల ఇన్విజిలేటరు సంతకము గల బాక్సులో ముందే సంతకము చేయరాదు. వాటిని వారి పరీక్షగదిలోని విద్యార్థులకు ఇచ్చి, వారిచే దానిలోని వివరములను పూర్తి చేయించిన తరువాత మాత్రమే ఇన్విజిలేటరు సంతకము గల గడిలో సంతకము చేయవలెను.

7. OMR SHEETS విద్యార్థులకు ఇచ్చేముందు వారి హాల్ టికెట్టును పరిశీలించిన తరువాత మాత్రమే వారికి సంబంధించిన OMR SHEET ను ఇవ్వవలెను. పొరపాటున కూడా ఒకరి OMR SHEET ను ఇంకొకరికి ఇవ్వరాదు..

8. BAR CODE OMR SHEETS ను గురించి విద్యార్థులకు ముందుగా తగిన సూచనలు ఇచ్చిన తరువాత మాత్రమే వారిచే దానీలో గల వివరములు పూర్తి చేయించవలెను.

9. OMR SHEETS ను పరీక్ష పూర్తయ్యేవరకు చిరిగిపోకుండా, నలిగి పోకుండా, దుమ్ము అంటకుండా జాగ్రత్తగా చూసుకొనవలసినదిగా విద్యార్థులకు చెప్పవలెను.

. *_పరీక్ష జరుగు నమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు_*

10. విద్యార్థులను పరీక్షరూమ్ లోనికి అనుమతించే ముందు వారి హాల్ టికెటిను పరిశీలించి దాని పై గల PHOTO లోని విద్యార్ధి, పరీక్ష వ్రాయుటకు వచ్చిన విద్యార్ధి ఒక్కరే అని  నిర్ధారించుకొన్న తరువాతే పరీక్ష జరుగు రూమ్ లోనికి అనుమతించ వలెను.

11. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసి వారి వద్ద మొబైల్ ఫోన్లు, ఆరోజు SUBJECTS కు సంబంధించిన FORBIDDEN MATERIAL లేదని నిర్ధారించుకొనవలెను. ఒక వేళ FLYING SQUAD వచ్చినప్పుడు విద్యార్థుల వద్ద ఏదైనా FORBIDDEN MATERIAL దొరికినచో దానికి ఇన్విజిలేటర్లదే పూర్తి బాధ్యత.

12. ఉదయం గం.9;30 ని.ల లోపు విద్యార్థులకు OMR SHEETS, MAIN ANSWER SHEETS లను ఇచ్చి వాటి పైన గల వివరములను జాగ్రత్తగా పూర్తిచేయించి, పిన్నులు కొట్టి, స్టిక్కర్లు అతికించి,OMR, ANSWER SHEET లపై విద్యార్థులు, ఇన్విజిలేటర్లు సంతకాలు చేయుట వంటి కార్యక్రమమును పూర్తి చేయవలెను. గం. 9.30 ని.లకు ప్రశ్నాపత్రములు ఇవ్వవలెను.

13. ఇన్విజిలేటర్లు విద్యార్థులకు ప్రశ్నాపత్రములు (QUESTION PAPERS) ఇచ్చునప్పుడు వారిని అడిగి QUESTION PAPER ఇవ్వరాదు. వారి OMR షీటును గాని, హాల్ టికెట్లు గాని చూసి దానిపై ఆరోజు గల QUESTION PAPER CODE ప్రకారం ఇవ్వవలెను. ఈ విషయంలో ఇన్విజిలేటరు పూర్తి జాగ్రత్తగా ఉండవలెను.

14. OMR SHEETS పైన, అటెండెన్స్ షీట్లపైన విద్యార్థుల సంతకములు తప్పని సరిగా తీసుకొనవలెను. లేనిచో వారు పరీక్షకు హజరుకానట్లుగా పరిగణించబడును.

15. మెయిన్ ఆన్సరు షీటుపై ప్రింట్ చేయబడిన నంబరును OMR SHEET పైన అదనపు సమాధాన పత్రములపై, గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్లన్నిటిపైనా వేయించ వలెను.

16. విద్యార్థులకు అదనపు సమాధాన పత్రములు అవసరమైనచో ఇన్విజిలేటరు వారి వద్దకే వెళ్ళి ఇవ్వవలెను. వారికి ఇవ్వబడిన ADDITIONAL ANSWER SHEETS పై గల నంబరును ADDITIONAL ANSWER SHEET ACCOUNT నందు నమోదు చేయవలెను. BIT PAPER ఇవ్వగానే అన్నింటినీ సరైన క్రమములో ఉంచి దారము కట్టవలసినదిగా చెప్పవలెను.

*పరీక్ష ముగిసిన తరువాత*

17. పూర్తీ పరీక్షా సమయము ముగిసిన తరువాత ఇన్విజిలేటరు ROLL NUMBERS ప్రకారము విద్యార్థుల వద్ద నుండి ఆన్సర్ షీట్లను తీసుకొని MAIN, ADDITIONALS, BIT PAPERS, GRAPH, MAPS మొదలగు వాటిని సరిచూచుకొని, సమాధానములు వ్రాయటం పూర్తయిన చోట ఒక గీతను గీచి అక్కడ "THE END" అని వ్రాసి మిగిలిన తెల్లకాగితములను కొట్టివేయవలెను.

18. విద్యార్థుల నుండి సేకరించిన సమాధాన పత్రములు లెక్కించి, పరిశీలించి, అన్నీ సరిపోయినవని నిర్ధారించుకున్న తరువాతే విద్యార్ధులను ఒక్క సారిగా బయటకు పంపవలెను. అంతేకాని ఒక్కొక్కరిగా పంపరాదు.

19. విద్యార్థుల నుండి సేకరించిన సమాధాన పత్రములను ప్రశ్నాపత్రం కోడ్ ప్రకారం వేరు చేసి C.Sకు అందజేయవలెను.

20. ఇన్విజిలేటర్లు వారి పరీక్ష రూమ్ నందు జరుగు పరీక్షను ప్రశాంత వాతావరణము లో,  నియమానుసారము ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించ వలెను.

21. పరీక్ష జరుగు గదిలో సంభంవించే సమస్యలకు ఇన్విజిలేటరు పూర్తిగా బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఇన్విజిలేటరు తగు జాగ్రత్తగా తన విధులను నిర్వహించవలెను.

22. విద్యార్థులు ఒకరి సమాధాన పత్రము ఇంకొకరు చూసి వ్రాయుట, మాట్లాడు కొనుట, సైగలు చేసుకొనుట మొదలగు వాటిని అనమతించరాదు. వారి స్థానము నుండి కదలకుండా చూడవలెను. ఒకవేళ మంచి నీటికి గాని, టాయిలెట్లకు గాని వెళ్ళవలసి వస్తే వారితో బాటు ఎటువంటి మెటీరియల్ బయటకు తీసుకొని వెళ్ళకుండా, తిరిగి వచ్చేటప్పుడు ఎటువంటి మెటీరియల్ లోపలికి తీసుకొని రాకుండా చూడవలెను.

23. ఇన్విజిలేటర్లు పూర్తి పరీక్షా సమయము తమకు కేటాయించిన రూమ్ లోనే ఉండవలెను. పరీక్ష రూమ్ నుండి బయటకు రావడంగాని, ప్రక్క రూమ్  లోని ఇన్విజిలేటర్ లతో మాట్లాడుట గాని చేయరాదు.

24. ఇన్విజిలేటర్లు తమకు ఎవైనా ఇబ్బందులు ఎదురైనా, సహాయము కావాలన్నా రీజర్వులో ఉన్న స్టాఫ్ కు గాని, C.S. కు గాని, D.O. కు గాని తెలియజేసి తగు సహాయము పొందవచ్చును.

25. ఇన్విజిలేటర్లు CS. ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించి పరీక్షా కేంద్రము నుందు S.S.C పబ్లిక్ పరీక్షలు సాఫీగా, సక్రమంగా జరుగుటకు సహకరించవలెను..